Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 5:04 pm Posted by : ramakrishna

జగన్నాథ రథయాత్రకు భక్తులు తరలిరండి

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇస్కాన్ జగన్నాథ రథయాత్రకు భక్తులు భారీగా తరలిరావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. ఇస్కాన్ కంటేశ్వర్ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…నగరంలోని కంటేశ్వర్ ఆలయం నుంచి ఈ నెల 24న రథయాత్ర ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే రథయాత్రలో ఇందూరు భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే..పరిమితమైన ఇస్కాన్ సేవలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని కొనియాడారు. నీలకంఠేశ్వరాలయం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర నగరంలోని ప్రధాన వీధుల గుండా తిరిగి కంటేశ్వర్ లోని శ్రీ రామ గార్డెన్ కు చేరుకుంటుందన్నారు. ఇస్కాన్ కంటేశ్వర వ్యవస్థాపక అధ్యక్షుడు రామానంద రాయి గౌరదాస ప్రభు జి, నిత్య చాంద్ ప్రభుజి, బలరాం ప్రభు జి, బిజెపి కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బెల్లాల్ శశాంక్, సీనియర్ నాయకులు స్వామి యాదవ్, రఘుపతి గౌడ్, రోహిత్ ప్రబుజీ, సునీల్ ప్రభు జి, భార్గవ్ ప్రభుజి తదితరులు పాల్గొన్నారు.