- అర్ధరాత్రి వరకు కొనసాగిన బాపూజీ వచనాలయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ
- కల్లు మామూలు ముస్తేదారుల చేతుల్లో వచనాలయం
- ప్రత్యర్థ అభ్యర్థి రఫిక్ ఖాన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి ఐదేండ్లకు ఒకసారి నిర్వహించే బాపూజీ వచనాలయం నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొనసాగింది. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ నాలుగు గంటల వరకు కొనసాగగా, సాయంత్రం 5:30 నుండికౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా ఎన్నికల అధికారులు 17 బెండళ్ళుగా ఉన్న కార్యవర్గ సభ్యుల ఓట్లను మొదటగా లెక్కించారు. అయితే మొదటి రౌండ్ నుండి వార్ వన్ సైడే అన్నట్టుగా మాజీ అధ్యక్షుడు భక్తవత్సలం నాయుడు వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లుగా కనపడింది. ఆయనకు చెందిన ప్యానల్ గెలుపు దిశగా అడుగులు వేశారు. ఇప్పటికే భక్త వత్సలం నాయుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందగా, దీనికి తోడు నగరంలోని అయ్యప్ప ఆలయ చైర్మన్ గా, ఇంతకుముందు బాపూజీ వచనాలయం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడం, వచనాలయం కు వచ్చే పాఠకుల కొరకు ఇక్కడికి వచ్చే పాఠకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు, మహిళలకు పురుషులకు వేరువేరుగా ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేయడం భక్తవత్సలం నాయుడు అధ్యక్షుడిగా పని చేసిన రోజుల్లో ఇలాంటి అనేక సంస్కరణలుచేసిన అనుభవం ఆయనకు ఉంది. దీంతో ఆయన గెలుపు సునాయాసం కావచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు. రాత్రి 12 వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. అయితే ప్రత్యర్థి అధ్యక్షుడిగా పోటీ చేసిన రఫిక్ ఖాన్ మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా మేధావులు, విద్యావంతులు ఉండాల్సిన అధ్యక్ష పదవి కుర్చీలో కల్లు ముస్తేదారులు ఉండడం బాధను కలిగిస్తుందనిఆయన అన్నారు. కాగా ఆయన చివరి వరకు గట్టి పోటీని ఇచ్చారు. పాత కమిటీలోని లోటుపాట్లను సవరించేందుకే ప్రత్యర్థి అభ్యర్థిగా అధ్యక్షునిగా తాను పోటీలో ఉన్నట్లు, ఓటర్లు ఏ తీర్పు తెలిపినశిరసా వహిస్తామని తెలిపారు. మొత్తం మీద వచనాలయం మార్పు కోసమే తాను పోటీలో నిలబడనే తప్ప పదవుల కోసం కాదని ఆయన వివరించారు.
