Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2025, 9:28 pm Posted by : ramakrishna

దేవీలాల్‌ను ఉత్తరభారతీయులే కాదు దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రతి రైతు ప్రేమిస్తాడు

  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

 

వెబ్ డెస్క్, బతుకమ్మ : తెలంగాణ నుంచి హర్యానా గురించి ఆలోచిస్తే ఒక విషయం గుర్తుకు వస్తుంది. దేవీలాల్‌ను ఉత్తరభారతీయులే కాదు దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రతి రైతు ప్రేమిస్తాడు. దేవీలాల్‌ తన రాజ్ఞనీత్ఞతతో రైతుల కోసం చాలా చేశారు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మాజీ  ఉప ప్రధాని దేవిలాల్ 112వ జయంతి ఉత్సవం సంధర్బంగా హర్యానాలోని రోహతక్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  నివాళ్లు అర్పించారు. ఈ సంధర్బంగా  కవిత మాట్లాడుతూ…చౌదరీ దేవీలాల్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్‌  నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) కుటుంబ సభ్యులంతా ఇక్కడ ఉన్నారు. ఉత్సాహంతో మీరంతా ఇక్కడ కూర్చుండటాన్ని నేను గమనించారు. ఇది దేవీలాల్ జయంతి ఉత్సవం కాదు..  మన అభయ్‌ అన్నను ముఖ్యమంత్రి చేస్తామనే శపథం లా ఉంది అని అన్నారు. దేవీలాల్‌ సామాన్య కార్యకర్తల నుంచి పెద్ద నేతల వరకు అందరినీ  కలుస్తారనే అనే పేరు ఉంది.. దేవీలాల్‌ మన మధ్య లేరు కానీ దేశంలో ప్రస్తుతం రైతుల దుస్థితి చూస్తే ఆయన ఆత్మఘోషిస్తుంది అని తెలిపారు. దేశంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వాలని రైతులకు నష్టం చేసే విధానాలను తీసుకుంటున్నాయి. రైతులను పేదలను మహిళలను చాలా ఏళ్ల పాటు జైలులో ఉంచారు. బీజేపీని ఇక్కడ గద్దె దించే సమయం ఆసన్నమైందన్నారు.  హర్యానాలో వ్యవసాయానికి ఇచ్చే కరెంట్‌పై 35 శాతం ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అభయ్‌ అన్నకు నేను ఒక్కటే విజ్జప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలోని రైతులంతా మీకోసం ఎదురుచూస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత విద్యుత్‌ ఇస్తామని వాగ్దానం చేయండి అని పిలుపు నిచ్చారు. కేసీఆర్‌  ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది. అది వారికి ఎంతో మేలు చేసింది. హర్యానాలో రైతులు దుఃఖంలో ఉన్నారు. మేము ఓబీసీల హక్కుల కోసం పోరాడుతుంటే మాకు మద్దతుగా అర్జున్‌సింగ్‌ తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా నేను ఓం ప్రకాశ్‌ చౌతాలాను కూడా యాది చేసుకుంటాను అని గుర్తు చేశారు.అందరి హృదయాలను గెలుచుకునేలా ఆయన మాటలు ఉంటాయి. ఇది మనం ఆయన నుంచి నేర్చుకోవాలి. అభయ్‌ నేతృత్వంలోని ఐఎన్‌ఎల్‌డీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు.

Devi Lal is loved not only by North Indians but also by every farmer in the southern states