నగర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం
నగర మేయర్ నీతూ కిరణ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని 5డివిజన్లలో సుమారు 50లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి ప్రారంభించినట్లు మేయర్ తెలిపారు. 8వ డివిజన్ గణేష్ నగర్ కాలనిలో 10లక్షలతో సీసీ రోడ్డు పనులు 14 వ డివిజన్లో 10లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు, కల్వర్ట్ పనులను, 30వ డివిజన్ మాజీ డిప్యూటీ మేయర్ మిర్మాజాజ్ అలీ ఏరియాలో చేపట్టే సీసీ రోడ్డు పనులను 54వ డివిజన్ ముజాహిద్ నగర్ లో చేపట్టే సీసీ డ్రైనేజీ పనులను, 55వ డివిజన్ మాలపల్లి మస్జీద్ ముందర కాలనిలో లో చేపట్టే సీసీ డ్రైనేజీ పనులను 19వ డివిజన్ లో 10లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ నగర అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావలసిన బకాయిల విడుదలలో ఆలస్యం కావటం వల్ల అభివృద్ధి పనులను పరుగులు పెట్టించలేక పోతున్నామని అన్నారు. కేవలం మున్సిపల్ నిధులతో అభివృద్ధి కష్టతరమని నగర ఎమ్మెల్యే, ఎమ్మెల్సిలు నిధుల విడుదలకు కృషి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, స్థానిక కార్పొరేటర్లు విక్రమ్ గౌడ్, షకీల్, నసీర్, మీసాల సవిత శ్రీనివాస్, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్లు ముస్తాక్ అహ్మద్, సుదర్శన్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ సల్మాన్, వాజీద్ తదితరులు పాల్గొన్నారు.
