అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ప్రజలకు మరిన్ని ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నగరంలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాగునీటి సరఫరాను మెరుగు పర్చేందుకు అమృత్ 2.0 పథకం కింద ఖానాపూర్, కాలూర్ లలో నిర్మిస్తున్న ఈ.ఎల్.ఎస్.ఆర్ ట్యాంకుల...