అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలి
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపల్ పట్టణాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్...