. . . జోరుగా 2వ డివిజన్ పరిధిలో ఇంటింటికి ప్రచారం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జీ వినయ్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 2వ డివిజన్ మాణిక్ బండార్ పరిధిలోని కార్నర్ మీటింగ్ లో వినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత ప్రచారాన్ని నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డు అభ్యర్థి గుండు అరుణకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత మాట్లాడుతూ నా సొంత గ్రామం నుండి నేను పోటీ చేసి గతంలో ఎంపీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని, గ్రామ అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో అరుణను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి ప్రకాష్ వెంకటేష్, భూరోల్ల అశోక్, దయాకర్ రావు, గంగాధర్ గౌడ్, సర్పంచ్ భూమన్న, భరత్, సతీష్, రమేష్, శబ్బిర్, జిగేల్ సింగ్ 2వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
