Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 7:16 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి

  • మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

 

రుద్రూర్, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ హయంలోనే అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ హయంలోనే అభివృద్ధి చెందిందని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు వస్తే బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఈ నెల 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ  రుద్రూర్ మండల ఇంచార్జ్  గాండ్ల మధు, నాయకులు జువ్వల శ్రావణ్, దౌర్ సాయిలు, హజీ, నరేందర్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.