Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 1:04 pm Posted by : ramakrishna

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి  

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ కనెక్టివిటీ పెంచడమే మోదీ సర్కార్ లక్ష్యం

కాగజ్ నగర్ లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాగజ్ నగర్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ కనెక్టివిటీ పెంచడమే మోదీ సర్కార్ లక్ష్యమన్నారు. తెలంగాణలో రహదారుల విస్తీర్ణం 5 వేల కి.మీ. దాటిందన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూ.3,900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈకార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రూ.3,900 కోట్ల చేసిన పనులను ప్రారంభించు కోవడం సంతోషంగా ఉందన్నారు. జాతీయ రహదారుల విస్తరణతో రోడ్డు ప్రమాదాలు, ప్రయాణ సమయం భారీగా తగ్గాయన్నారు. తెలంగాణకు టెక్స్ టైల్ పార్కు మంజూరు చేశామన్నారు. రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను పునరుద్ధరించుకున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు మంజూరు చేశామన్నారు. ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్ పోర్టు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోందన్నారు.

జాతీయ రహదారులతో ఆధ్యాత్మిక క్షేత్రాల అనుసంధానం : గడ్కరీ

భద్రాచలం, బాసర, మేడారం తదితర ఆధ్యాత్మిక క్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. వ్యవసాయం, ఉపాధి, రవాణా, మౌలిక సదుపాయాలు అనే 4 అంశాలు అభివృద్ధిని నిర్దేశిస్తాయని  వాటిపై ప్రత్యేక దష్టి పెట్టామన్నారు. సూర్యపేట – దేవర్ పల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, నాగ్ పూర్- విజయవాడ కారిడార్ నిర్మాణాలు చేపట్టమన్నారు.