. . . రేవంత్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు
. . . దేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంది
. . పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
ఇందల్వాయి , బతుకమ్మ:
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని దేశంలోనే తెలంగాణ దూసుకుపోతుందనిరాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ , జిల్లా ఇంచార్జీ మంత్రి దనసరి సీతక్క అన్నారు. శనివారం ఇందల్వాయి మండలంలోని పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రారంభించారు.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో సుమారు రూ.25 కోట్ల రూపాయలు నిధులతో నిర్మించిన, నిర్మించ తలపెట్టిన నిధులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తీర్మాన్ పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ… మారుమూల గిరిజన తండాలు, గ్రామాలలో అభివృద్ధి పనులలో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమంటూ మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవ ప్రజలని హితువు పలికారు, తెలంగాణ అభివృద్ధి కోసం కేవలం రెండున్నర ఏళ్లలో అనేక గ్రామాలలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతున్న ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రతి గ్రామంలో నేడు ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తున్నాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందాయని మళ్లీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే నిరుపేదలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ, విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. పిల్లలు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయిలో రాణించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా రూరల్ నియోజకవర్గంలో గిరిజన తండాలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు.

కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు.. పలు ప్రారంభోత్సవాలు..
రాంపూర్ తండా నుండి వెంగల్ పాడ్ తండా వరకు రూ.5.48 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న బీ.టీ రోడ్డు నిర్మాణానికి, అలాగే కే.కే తండా నుండి మెగ్యానాయక్ తండా వరకు రూ. 2.94 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డితో కలిసి మంత్రి సితక్క భూమి పూజ చేశారు. అనంతరం తిర్మన్ పల్లిలో గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో అదనపు సదుపాయాల కల్పనలో భాగంగా నూతనంగా నిర్మించిన వసతి గృహ భవన సముదాయం, కిచెన్ డైనింగ్ హాల్ లను లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.

మంత్రి సీతక్కకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు..
అంతకుముందు ఇందాల్వాయి టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి అధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు, ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమీషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఉర్ధు ఆకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, కల్లు గీత వ్రుత్తి కార్పోరేషన్ చైర్మెన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతల కిషన్, ఐడీసీ ఎం ఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, సర్పచులు లోకని గంగామణి గంగారం, సుజాత శ్రీనివాస్, సంగీత దిలీప్ కుమార్, మైపాల్ నాయక్, బైరయ్య, తదితరులు పాల్గొన్నారు
