ఉత్తమ ఉపాధ్యాయునిగా దేవాచారి
వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా మండలంలోని రామన్నపేట సంతోషిమాత కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవాచారి ఎంపికయ్యరు.వ్యాస పౌర్ణమిని పురస్కరించుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీ పీ యు ఎస్)జిల్లాలోని 32 మండలాలకు గాను 32 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయగా అందులో దేవాచారి ఎంపికయ్యారు. ఈ సందర్బంగా దేవాచారిని బస్వా గార్డెన్ లో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం లో మండల తపస్ అధ్యక్షులు కె. రవిచందర్ సెక్రటరీ అజయ్, తపస్ కార్యకర్తలు పాల్గొన్నారు.