కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల వివరాలు పక్కాగా అందించాలి

దిశ సమావేశంలో ఎం.పీ ధర్మపురి అర్వింద్   నిజామాబాద్, బతుకమ్మ :  ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న...