Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 March 2025, 3:55 pm Posted by : ramakrishna

దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలి

  • రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ కోరారు. ఉమ్మడి జిల్లాలోని మండలాల వారీగా యాసంగిలో సాగుచేస్తున్న పంటల వివరాలు, వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటల వివరాలు ఇవ్వాలన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేసిన విషయాన్నీ గుర్తుచేశారు. అందులో భాగంగానే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండి.. రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటదని గడుగు గంగాధర్ స్పష్టం చేశారు.