మంచిర్యాల, బతుకమ్మ : మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని కోటపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, తండ్రికి బదులుగా అటెండర్ గా పనిచేస్తున్న మరొకరు రూ.10వేలు లంచం తీసుకుంటుండుగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పాస్ పుస్తకంలో సవరణలు చేసేందుకు లంచం డిమాండ్ చేయగా బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కెమికల్ టెస్టుల్లో నిర్ధారణ అయినట్లుగా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.