వెబ్ డెస్క్, బతుకమ్మ :
క్వాలిటి కంట్రోల్ సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కారు. మంగళవారం ముషీరాబాద్ డివిజన్ క్వాలిటి కంట్రోల్ విభాగం లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న సాయిరాం కాంట్రాక్టర్ కు 2 సీ సిర్టిఫికెట్ ఇవ్వడానికి 10 వెల లంచం తీసుకుంటుoడగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి డిఈఈ సాయిరాం ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్ట్ లో హాజరు పరిచినట్టు సిటీ రేంజ్ 1 ఏసీబీ అధికారులు తెలిపారు.