ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కలెక్టర్
సంగారెడ్డి, బతుకమ్మ : రైతుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ గురువారం ఏసీబీకి చిక్కిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, తయారీ మండలం కోసం గతంతో రైతుల నుంచి భూమి సేకరించారు. ఇందుకు సంబంధించి రైతులకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. పరిహారం చెక్కులు మంజూరు చేసేందుకు నిమ్జ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్ లంచం డిమాండ్ చేశారు. ఓ రైతుకు మంజూరైన రూ.52,87,500 చెక్కును అందజేసేందుకు...