Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 7:37 pm Posted by : ramakrishna

డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు బేఖాతరు ?

 

. . . గోపాల్‌కు మళ్లీ అదే స్టేషన్‌లో పోస్టింగ్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్కార్ట్ వ్యవహారంలో చర్యలకు గురైన పోలీసు అధికారి గోపాల్‌కు మళ్లీ అదే పోలీస్ స్టేషన్‌లో పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫిర్యాదు మేరకు గోపాల్‌ను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించి ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అయితే, అటాచ్ చేసిన మరుసటి రోజు మధ్యాహ్నానికే గోపాల్‌ను తిరిగి అదే పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామం పోలీసు శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. స్వయంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ, కేవలం ఒకరోజు మాత్రమే చర్యలు తీసుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవడం వెనుక కారణాలపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికారికంగా పోలీసు శాఖ నుంచి ఎలాంటి వివరణ వెలువడలేదు. గోపాల్‌కు మళ్లీ అదే స్టేషన్‌లో పోస్టింగ్ ఇవ్వడానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.