Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 December 2024, 4:22 pm Posted by : ramakrishna

ఉపాధ్యాయుల డెప్యూటేషన్లను రద్దు చేయాలి

పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు  ఎస్.కృపాల్ సింగ్

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :  అన్ని కేటగిరిల ఉపాధ్యాయుల డెప్యూటేషన్లను రద్దు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు  ఎస్.కృపాల్ సింగ్ జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఇటీవలే ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు చేసిన విషయం విధితమే.. కానీ గతంలో వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరుతో జరిపిన డిప్టేషన్లలోనే ఉపాధ్యాయులు కొనసాగుతున్నారన్నారు. కావున  కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో పీఆర్టీయూ తెలంగాణ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన జిల్లా లోని వివిధ కేటగిరీల్లో డెప్యూటేషన్లలో కొనసాగుతున్న ఉపాధ్యాయులను వారి సొంత పోస్టింగ్ లలో తిరిగి పంపించవలసినదిగా జిల్లా కలెక్టర్ ని కోరామని తెలిపారు. ఎందుకంటే ఈ మధ్యనే పదోన్నతులు, బదిలీలు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలతో చాలా ఖాళీలు భర్తీ అయినప్పటికి గత డీఈఓ జారీ చేసిన డెప్యూటేషన్ల పైననే ఉపాధ్యాయులు కొనసాగుతున్నారని తెలిపారు. తక్షణమే అన్ని మండలాల వారిగా డెప్యూటేషన్ లపై కొనసాగుతున్న ఉపాధ్యాయుల జాబితా ( వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా ) తో పాటు అన్ని కేటగిరీ ఉపాధ్యాయుల డెప్యూటేషన్ ( వర్క్ అడ్జస్ట్మెంట్ తో పాటు ) తక్షణమే రద్దు చేయాలని  కోరామని తెలిపారు.