కోర్టు కేసుల పేరిట జిల్లా పరిషత్ కు డిప్యూటేషన్

పక్కా ప్రణాళికతో ఒకరికి నెల.. మరొకరికి రెండు నెలలు సైలెంట్ గా పాగా వేసేందుకేనా..? బతుకమ్మ, నిజామాబాద్ : వడ్డించేది మనోడు అయితే బంతిలో ఏ మూల కూర్చున్న అందుతుందనే సామెతను జిల్లా పరిషత్ వ్యవహారాలు నిజం చేస్తున్నాయి. బదిలీపై వెళ్లిన ఇద్దరినీ యథాస్థానానికి డిప్యూటేషన్ పై తెచ్చేందుకు చాలా ఎత్తుగడలు వేశారు. ఈ విషయం కాస్త రూరల్ ఎమ్మెల్యేకు చేరడంతో తన నియోజకవర్గంలో ఉన్న ఉద్యోగులకు డిప్యూటేషన్ వేయకూడదని, వారిని వెనక్కి పంపాలని కోరారు. అసలు వచ్చేలా ఉందని పసిగట్టిన ఒక గ్రూప్...