అణగారిన వర్గాలు ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే

బతుకమ్మ,మోర్తాడ్: మహాత్మా జ్యోతి రావు  పూలే  199 వ  జయంతి సందర్భంగా శుక్రవారం మోర్తాడ్ మండల కేంద్రంలోని  జ్యోతి రావు  పూలే విగ్రహానికి పూల మాల వేసి   నివాళులర్పించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడని గుర్తు చేశారు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల...