Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2025, 4:07 pm Posted by : ramakrishna

అణగారిన వర్గాలు ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే

బతుకమ్మ,మోర్తాడ్: మహాత్మా జ్యోతి రావు  పూలే  199 వ  జయంతి సందర్భంగా శుక్రవారం మోర్తాడ్ మండల కేంద్రంలోని  జ్యోతి రావు  పూలే విగ్రహానికి పూల మాల వేసి   నివాళులర్పించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడని గుర్తు చేశారు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడిన మహా నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలియజేశారు. స్త్రీలు అభివృద్ధి చెందుతున్న సమాజం బాగుపడుతుందని చెప్పిన గొప్ప మహానీయుడు. సామాజిక అంతరాలపై తన కలంతో గులాంగిరి ద్వారా యుద్ధ శంఖం మోగించిన యోధుడు మహాత్మ జ్యోతిబాయ్ పూలే అని అన్నారు. రానున్న రోజుల్లో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశలను కొనసాగిస్తూ బీసీ సంఘాలు ఐక్యంగా ఉండి ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో  మోర్తాడ్ మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.