Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 8:08 pm Posted by : ramakrishna

దశల వారిగా డబ్బు ఖాతాల్లో జమ

  • మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్

 

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో ఇండ్లు నిర్మించుకొంటున్న లబ్దిదారుల డబ్బులు దశల వారీగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని భీమ్ గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన శనివారం పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణం పనులు జరుగుతున్న క్రమంలో పనిని బట్టి ప్రభుత్వం డబ్బులు ప్రతి సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్నామని అన్నారు.ఇప్పటివరకు ఇంకా ఇండ్ల నిర్మాణం చేపట్టని లబ్దిదారులు వెంటనే పనులు ప్రారంభించాలాన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ మేనేజర్, వార్డ్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.