కస్తూర్బా పాఠశాలను సందర్శించిన డీఈఓ
కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా విద్యాశాఖ అధికారి రాజు బుధవారం కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు. పదవ తరగతి పరీక్షలు ధైర్యంగా రాయాలని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో జరిగిన మార్పులను వివరించారు. గతంలో వలె కాకుండా ఈసారి పదవ తరగతి విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈసారి గ్రేడింగ్ ఉండదని మొత్తం80 మార్కులకు వార్షిక పరీక్ష అని 20 మార్కులు...