Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2025, 5:54 pm Posted by : ramakrishna

కస్తూర్బా పాఠశాలను సందర్శించిన డీఈఓ

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా విద్యాశాఖ అధికారి రాజు బుధవారం కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు కొన్ని సూచనలు చేశారు.  పదవ తరగతి పరీక్షలు ధైర్యంగా రాయాలని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో జరిగిన మార్పులను వివరించారు. గతంలో వలె కాకుండా ఈసారి పదవ తరగతి విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈసారి గ్రేడింగ్ ఉండదని మొత్తం80 మార్కులకు వార్షిక పరీక్ష అని 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉంటాయని తెలిపారు. వచ్చే సంవత్సరం మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఈసారి పదవ తరగతి మార్కుల మెమొరండంపై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ప్రింట్ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏ.వెంకటేశం, కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ వీణ పాల్గొన్నారు.

DEO visited Kasturba School