వెళ్తూవెళ్తూ అందినకాడికి దండుకున్న డీఈవో?
. ఆగమేఘాల మీద ఏఎంవో నియామకం . ఉత్తర్వులను రద్దు చేసిన ఉన్నతాధికారులు . డిప్యుటేషన్లు, ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల సంగతేమిటో..? నిజామాబాద్, బతుకమ్మ: వివాదాస్పద నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జిల్లా విద్యాశాఖను ఇటీవల బదిలీ అయిన డీఈవో దుర్గా ప్రసాద్ వెళ్తూవెళ్తూ మళ్లీ చర్చల్లోకి నెట్టి వెళ్లారు. సోమవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు వచ్చిన తరువాత సదరు ఉన్నతాధికారి నియామకాలు, డిప్యుటేషన్లు చేపట్టడం చర్చనీయాంశమైంది. విద్యాశాఖలో అత్యంత కీలకమైన ఏఎంవో పోస్టులో అనర్హుడిని కూర్చోపెట్టారు. సీనియర్ గెజిటెడ్ హెడ్మాస్టర్ కు...