Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 5:57 pm Posted by : ramakrishna

అబ్దుల్ జలీల్ ను సన్మానించిన డీఈఓ

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డిలోని బడా కసబ్ గల్లీలో ఎంపీపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అబ్దుల్ జలీల్ శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ కార్యక్రమానికి డీఈఓ రాజు, ఎంఈఓ ఎల్లయ్య హాజరై శాలువా, పుష్ప గుచ్ఛం తో సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు కుంట రాములు, ప్రధాన కార్యదర్శి పంపరి ప్రవీణ్ కుమార్, కలిముద్దీన్, పందిరి రాజేష్ సయ్యద్ అబ్దుల్ జలీల్ నిశాలువా మెమెంటో, పుష్ప గుచ్ఛంతో సన్మానించారు. కురుషీద్, ఈజాజ్ అహ్మద్,శాలువా, పుష్ప గుచ్ఛం తో సన్మానం చేశారు. షరీఫ్, కాజా మొయిన్,ఫరూక్, రమణ, బాబు తదితరులు పాల్గొన్నారు.