తపస్ ఆధ్వర్యలో డీఈఓకు సన్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ను తపస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. త్రిబుల్ ఐటీ సీట్లు సాధించడంలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ ను ఉత్తమ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భట్టు, బద్రీనాథ్, రామకృష్ణారెడ్డి, కీర్తి, సుదర్శన్, మధుసూదన్, రాజ్ కుమార్, శివప్రసాద్ పాల్గొన్నారు.