ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన డీఈఓ అశోక్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని ఆదర్శ హిందీ విద్యాలయంలో సౌత్ మండలం నుండి ఇద్దరు గెజిటెడ్ ఉపాధ్యాయులను, ఎనిమిది మంది స్కూల్ అసిస్టెంట్లను, పదిమంది హెచ్డి ఉపాధ్యాయులను శుక్రవారం డిఈవో చేతులమీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయులు అందరూ తమ విధులు సక్రమంగా నిర్వర్తించి విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడాలని, నేటి సమాజంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర వహించే మార్గదర్శకులు అని కొనియాడారు. సౌత్ మండలం ఎన్ యు సాయి రెడ్డి మాట్లాడుతూ చదువుతూనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని అందుకోసం...