Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 September 2025, 9:11 pm Posted by : ramakrishna

ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన డీఈఓ అశోక్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని ఆదర్శ హిందీ విద్యాలయంలో సౌత్ మండలం నుండి ఇద్దరు గెజిటెడ్ ఉపాధ్యాయులను, ఎనిమిది మంది స్కూల్ అసిస్టెంట్లను, పదిమంది హెచ్డి ఉపాధ్యాయులను శుక్రవారం డిఈవో చేతులమీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయులు అందరూ తమ విధులు సక్రమంగా నిర్వర్తించి విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడాలని, నేటి సమాజంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర వహించే మార్గదర్శకులు అని కొనియాడారు. సౌత్ మండలం ఎన్ యు సాయి రెడ్డి మాట్లాడుతూ చదువుతూనే విద్యార్థుల భవిష్యత్తు ఉందని అందుకోసం విధులు సక్రమంగా నిర్వహిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలిపారు. పి ఆర్ టి యు తెలంగాణ గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అని కొనియాడుతూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రమేష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అసురర్ హలీం, బద్దం శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.