Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2024, 4:55 pm Posted by : ramakrishna

రుద్రూర్ లో డెంగ్యూ పాజిటీవ్ కేసు నమోదు..

దోమ చిన్నది.. రోగం పెద్దది..

రుద్రూర్, బతుకమ్మ  :

ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పీహెచ్ఎన్ ఓ కృష్ణవేణి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో డెంగ్యూ పాజిటీవ్ కేసు నమోదు కావడంతో అదివారం వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇంటింటికి తిరుగుతూ ఇంట్లో గల నీటి కుళాయిలను పరిశీలించి, అపరిశుభ్రంగా ఉన్న నీటిని పారవేశారు. ఈ సందర్బంగా పీహెచ్ఎన్ ఓ కృష్ణవేణి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి చుట్టు పరిసరాలను ఎప్పటికప్పుడు పరి శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దోమలు ఎక్కువగా నీటిలో నిల్వ ఉంటాయన్నారు. నీటి కుళాయిలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమ చిన్నది.. రోగం పెద్దదని, ఇప్పుడు ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయని సూచించారు. అదేవిధంగా డెంగ్యూ వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎస్ ఎఫ్ జ్యోతి, హెచ్ ఏ ఎఫ్ ప్రమీల, ఆశా కార్యకర్తలు లత, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.