Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 March 2025, 4:54 pm Posted by : ramakrishna

5న ప్రయోగాల ప్రదర్శన

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ  విశ్వవిద్యాలయం  బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 5న జరిగే  జాతీయ సైన్స్ డే  సందర్భంగా  జీవ సాంకేతిక  శాస్త్ర ప్రయోగాల ప్రదర్శన సదస్సు బ్రోచర్ ను వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి కన్వీనర్ డాక్టర్ ప్రసన్నశీల, కో- కన్వీనర్  డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ మహేందర్ ఐలేని ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా సదస్సు కన్వీనర్,  బయోటెక్నాలజీ  విభాగాధిపతి డాక్టర్ ప్రసన్న శీల మాట్లాడుతూ ఈ ప్రయోగాల ప్రదర్శన సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు  హాజరవుతారని తెలిపారు. ఈ ప్రదర్శనలో  జీవ సాంకేతిక శాస్త్ర ప్రయోగ పద్ధతులు ఉపయోగించే పరికరాల పై అవగాహన కల్పిస్తారని తెలిపారు.