ప్రజాస్వామ్యం ఓడిపోయింది
నిజామాబాద్, బతుకమ్మ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయని, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీల పరంగా సిద్ధాంత పరంగా ఓట్లు చీలడంతో పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి పరాజయం పాలయ్యారన్నారు. ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు పోటీలు ఉండగా బీసీలందరూ ఏకం కావాలనే ఉద్దేశంతో ప్రసన్న హరిక్రిష్ణకు ఓట్లు వేశారన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉండి ఉంటే ఆ స్థానంలో అన్ని పార్టీలు బీసీలకే టికెట్ ఇచ్చేవని అన్నారు. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను...