ఉప సర్పంచ్‌లకు గౌరవ వేతనం కల్పించాలని డిమాండ్

  . . . శిలాఫలకాలపై పేర్లు, స్టాండింగ్ కమిటీల్లో వైస్ చైర్మన్ హోదా ఇవ్వాలని వినతి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   గ్రామ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప సర్పంచ్‌లకు గౌరవ వేతనం కల్పించాలని, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల శిలాఫలకాలపై వారి పేర్లు కూడా చేర్చాలని రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం డిమాండ్ చేసింది. రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షులు వికార్ పాషా ఆధ్వర్యంలో జిల్లాలోని ఉప సర్పంచ్‌లు మంగళవారం జిల్లా సమీకృత భవన సముదాయంలో డీఆర్‌ఓకు...