Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 January 2025, 9:00 pm Posted by : ramakrishna

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగే విధంగా చూడాలి

బతుకమ్మ భిక్కనూరు: ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరిగే విధంగా చూడాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రుక్మిణి తెలిపారు. శనివారం పట్టణ కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలను, రికార్డులను, ఓపి , వ్యాక్సినేషన్ వివరాలు పరిశీలించారు. క్రమం తప్పకుండా చిన్నారులకు వేసే విధంగా వైద్య సిబ్బందికి సూచించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ దివ్య, హెచ్ఈవో వెంకటరమణ, వైద్య సిబ్బంది ఉన్నారు.