సావిత్రిబాయి జయంతిని అధికారికంగా నిర్వహించడం పట్ల  హర్షం 

బీసీటీయూ  జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్   నిజామాబాద్, బతుకమ్మ :  సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నట్లు బీసీటీయూ  జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా "సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం" గా  నిర్వహించాలని ప్రభుత్వాన్ని బీసిటీయూ పక్షాన డిమాండ్ చేస్తూ వస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సావిత్రి బాయి పూలే జయంతి కార్యక్రమంను మొట్ట మొదటగా మొదలు పెట్టింది నిజామాబాద్ బీసీటీయూ అని గుర్తు...