సీజేఐ బీఆర్ గవాయిపై దాడికి నిరసనగా 17న ఛలో ఢిల్లీ
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సీజేఐ బీఆర్ గవాయిపై జరిగిన దాడికి నిరసనగా ఈనెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం న్యూ అంబేద్కర్ భవన్ లో జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ...