స్థల సేకరణలో జాప్యాన్ని నివారించాలి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ : ప్రజోపయోగ పనుల కోసం అవసరమైన స్థల సేకరణలో జాప్యానికి తావులేకుండా ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్సు హాల్ లో మంగళవారం స్థల సేకరణకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గత వారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, సాధించిన ప్రగతిని సమీక్షించారు. రోడ్ల నిర్మాణాలు, విస్తరణతో పాటు నూతన విద్యా సంస్థలు, వసతి గృహాలు,...