. . . ఆ తరువాతే బ్యాక్ లాగ్ ఫీజు నోటిఫికేషన్ విడుదల చేయాలి
. . . పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అనిల్ కుమార్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాల రివాల్యుయేషన్ ఫలితాలు ఇవ్వాలని, పరీక్ష ఫీజు సమయాన్ని పెంచాలని కోరుతూ తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే. సంపత్ కుమార్ కి పీడీఎస్ యు ఆధ్వర్యంలో శనివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్, పీడీఎస్ యు యూనివర్సిటీ నాయకులు జి.నితిన్ లు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గల అన్ని డిగ్రీ కళాశాల లో చాలా మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ కొరకు ఫీజును కట్టారని తెలిపారు. కానీ ఆ రివాల్యూయేషన్ ఫలితాలు ఇప్పటికీ యూనివర్సిటీ వెల్లడించలేకపోవడం బాధాకరమన్నారు. కానీ రివాల్యుయేషన్ ఫలితాలు రాకముందే బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజులు ఈ నెల చివరి వరకు చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు తెలపడం అన్యాయమన్నారు. ఆలస్య రుసుము లేకుండా బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజుల సమయం పెంచాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించి మొదటగా రివాల్యూయేషన్ ఫలితాలను వెలువడించిన తర్వాత బ్యాక్ లాగ్ ల పరీక్ష ఫీజులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యు యూనివర్సిటీ నాయకులు గణపతి, ప్రణీత్ లు పాల్గొన్నారు.