నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయo పరిధిలోని డిగ్రీ, సిబిసిఎస్ పరీక్షల రివాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రధికారి ఆచార్య కే సంపత్ కుమార్ ఒక ప్రకటననలో తెలిపారు. డిగ్రీ , ఒకటవ,మూడవ,ఐదవ సెమిస్టర్ (రెగ్యులర్) రెండవ,నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ నవంబర్ డిసెంబర్-2024 లో పరీక్షలకు హాజరైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఒక్కో పేపర్ కు 500 రూపాయలు, రివాల్యుయేషన్ ఫామ్ కు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 చివరి తేదీని తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందన్నారు.