బాన్సువాడ నుండి దెగ్లూర్ బస్సులు పెంచాలి

డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమంలో సూచన    మద్నూర్, బతుకమ్మ: ప్రయాణికులకు సురక్షితంగా గమ్యాన్ని చేర్చడమే ఆర్టీసీ లక్ష్యంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ఆర్టీసీ రీజియన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోలలో శుక్రవారం డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమం కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా, నిజామాబాద్ ఆర్ఎం జ్యోత్న ఆధ్వర్యంలో బాన్సువాడ డిపో మేనేజర్ శుక్రవారం సాయంత్రం 4గం.ల నుంచి 5గం.ల కు నిర్వహించారు. స్త్రీలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, వికలాంగులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చునివ్వాలి. మహిళలపై ఎవరైనా...