Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2025, 8:56 pm Posted by : ramakrishna

బాన్సువాడ నుండి దెగ్లూర్ బస్సులు పెంచాలి

  • డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమంలో సూచన 

 

మద్నూర్, బతుకమ్మ: ప్రయాణికులకు సురక్షితంగా గమ్యాన్ని చేర్చడమే ఆర్టీసీ లక్ష్యంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ఆర్టీసీ రీజియన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోలలో శుక్రవారం డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమం కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా, నిజామాబాద్ ఆర్ఎం జ్యోత్న ఆధ్వర్యంలో బాన్సువాడ డిపో మేనేజర్ శుక్రవారం సాయంత్రం 4గం.ల నుంచి 5గం.ల కు నిర్వహించారు. స్త్రీలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, వికలాంగులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చునివ్వాలి. మహిళలపై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వారిపై చర్య తీసుకోవాలి. స్త్రీలకు పురుషులకు కేటాయించిన ఎవరి సీట్లలో వాళ్లే కూర్చోవాలి. బస్సు ప్రయాణం సమయంలో ప్రాణానికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే కండక్టర్, డ్రైవర్ కు చెప్తే వాళ్ళు సమస్య పరిష్కరించాలి. బాన్సువాడ నుంచి దెగ్లూర్ కు వెళ్లాలంటే బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు కావున బస్సులు పెంచాలని డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమంలో బతుకమ్మ మద్నూర్  రిపోర్టర్ బాన్సువాడ డిపో కు సూచించారు. డిపో అధికారులు ఈ సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.