మత విద్వేషాలను ఓడించడమే అంబేడ్కర్ కు నిజమైన నివాళి

బతుకమ్మ,మోర్తాడ్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక సామాజిక వర్గం కోసం మాత్రమే పోరాడలేదు. సమస్త భారతీయ సమాజానికి అన్ని రంగాల్లో సమానత్వం, అందరికి సమ న్యాయం, ఆత్మగౌరవం కోసం  పోరాడారు. సమాజంలోని అన్ని వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో కూడిన భారతదేశాన్ని నిర్మించేందుకు తన జీవితాన్ని దారబోశారు. అయితే వర్తమానంలో కుల వివక్షత, హిందు ముస్లిం అనే మత విద్వేషం పెంచుతున్న రాజకీయాల నుంచి యువత జాగ్రతగా ఉండాలని, ఫూలే అంబేడ్కర్ల స్పూర్తితో వాటిని ఓడించడమే మహనీయులకు నిజమైన నివాళి అంటూ...