Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 7:45 pm Posted by : ramakrishna

మత విద్వేషాలను ఓడించడమే అంబేడ్కర్ కు నిజమైన నివాళి

బతుకమ్మ,మోర్తాడ్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక సామాజిక వర్గం కోసం మాత్రమే పోరాడలేదు. సమస్త భారతీయ సమాజానికి అన్ని రంగాల్లో సమానత్వం, అందరికి సమ న్యాయం, ఆత్మగౌరవం కోసం  పోరాడారు. సమాజంలోని అన్ని వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో కూడిన భారతదేశాన్ని నిర్మించేందుకు తన జీవితాన్ని దారబోశారు. అయితే వర్తమానంలో కుల వివక్షత, హిందు ముస్లిం అనే మత విద్వేషం పెంచుతున్న రాజకీయాల నుంచి యువత జాగ్రతగా ఉండాలని, ఫూలే అంబేడ్కర్ల స్పూర్తితో వాటిని ఓడించడమే మహనీయులకు నిజమైన నివాళి అంటూ ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు అంగుళి మాలజీ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం దళిత సంక్షేమ సంఘం (డిఎస్ఎస్) ఆధ్వర్యంలో జిల్లా నిజమాబాద్ మోర్తాడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆరంభంలో భీంరావు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చివర్లో నిర్వాహకులు అందరికి మిఠాయిలు పంచారు. ఈ ఉత్సవంలో  జాంబవ చమార్, సిరికొండ అనంతరావు, గంగాధర్, కవి రాజా, అరె అరుణ్, బండి సదానందం,బండి రాజేంద్రప్రసాద్  తదితరులు పాల్గొన్నారు.