బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం (ఢీట్) డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఉద్యోగ అవగాహన సదస్సును కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి పెద్దన్న ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణ, సమాచారం ఇచ్చి ఉద్యోగాలు కల్పించడము కొరకు ఏర్పాటు చేయడమైనదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ నేతృత్వంలో పరిశ్రమలు, పాణిధ్యశాఖ ద్వారా నోటిఫికేషన్లు ఇంటర్సిటీ అప్రెంటిస్ ఉద్యోగ సమాచారం డిట్ అందిస్తుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ఆప్ ద్వారా రిజిస్ట్రేషన్ నమోదు చేయుట గురించి కళాశాల డేట్ కోఆర్డినేటర్ అశోక్ శిక్షణ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు నేరుగా తమ మొబైల్ తో డేటా ద్వారా ఉద్యోగాలు ఎలా పొందుకోవచ్చు వైస్ ప్రిన్సిపాల్ మర్రిపల్లి భూపతి పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అవంతి, బ్యూలా, అర్చన, స్రవంతి, విద్యార్థి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.