వాహనం ఢీకొని జింక మృతి
బోధన్, బతుకమ్మ: బోధన్ మండలం రాంపూర్ కల్దుర్కి రాజన్న చౌరస్తా వద్ద బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన వాహనం జింకను ఢీకొట్టిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు సిబ్బంది రాములు, అనిరుధ్ ఘటనాస్థలానికి చేరుకొని జింకకు నీరు తాగించారని, కొద్ది సేపటికే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.