- బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిక్లరేషన్ బీసీల పేరుతో.. డెసిషన్ మైనారిటీల కోసం అని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయం లో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గల సంక్షేమే బీజేపీ లక్ష్యం అన్నారు. సామాజిక న్యాయం బీజేపీ తోనే సాధ్యం అన్నారు. బీసీలకు న్యాయం చేసింది బీజేపీ మాత్రమేనని, బీసీ ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రసుత రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము లాంటి సామాన్యులను గౌరవ స్థానాలకు చేర్చిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ఇచ్చి, మైనారిటీ రిజర్వేషన్ అమలు చేయడం మోసం కాదు అంటే మరేంటి? పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీల కోసం ఏ పని చేశారో ఒక్కటైనా చెప్పగలరా? బీసీ ఓటుతో గెలిచి మైనారిటీ వర్గాలకే పదవులు ఇచ్చారు అని తెలిపారు. బీజేపీ బీసీలకు గౌరవం, అవకాశాలు, భవిష్యత్తు ఇస్తోంది కాంగ్రెస్ మాయ మాటలు మాత్రమే.బీసీలను ఓటు బ్యాంక్‌గానే కాదు, నాయకత్వ శక్తిగా చూస్తుందన్నారు. మోదీ పాలనలో బీసీకి గౌరవం ఉంది కాంగ్రెస్ పాలనలో మోసం మాత్రమే ఉందని తెలిపారు. బీసీల పేరుతో పిక్నిక్‌లు చేస్తున్న వారిని ప్రజలు ఎప్పటికైనా గమనిస్తారని, బీసీల హక్కుల కోసం పోరాడేది బీజేపీ మాత్రమేనని తెలిపారు. బీసీ ఓటుతో ఎక్కి, మైనారిటీ ఆశీర్వాదంతో పదవులు పంచుకుంటే అది సేవ కాదు, ‘సెటప్’!అని దుయ్యాబట్టారు. డిక్లరేషన్ పేరు బీసీ… డెసిషన్ మొత్తం మైనారిటీ ఇదేనా కాంగ్రెస్ మంత్రిత్వ తంత్రం అని ఎద్దేవావ చేశారు. ఎన్నికల ముందు బీసీ ప్రేమ… అనంతరం మైనారిటీ సెటిల్మెంట్ ఇది కొత్త రాజకీయ ప్రేమకథ బీసీలకు దక్కే న్యాయం ప్రెస్ నోట్‌లోనే మిగిలిపోతుందా అని తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు. అదే విదంగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఆగష్టు 15 వ తేదీ వరకు జిల్లా లో హర్ గర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ప్రతి మండల కేంద్రం లో ర్యాలీ లు, పోరాట యోధుల విగ్రహాల ను శృద్ధి చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్మూర్ మాజీ మున్సిపల్ చేర్మెన్ కంచెట్టి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ,నిమ్మల శ్రీనివాస్,బీజేపీ నాయకులు డాక్టర్ కొండ ఆశన్న,అమంద్ విజయ్, రాంచందర్,మాస్టర్ శంకర్, సంతోష్, ముత్యాలు, నారాయణ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి,భూపాల్ రెడ్డి,మల్లేష్ గుప్తా, రాదా, మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
