గుర్తుతెలియని మహిళ మృతి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ బి.రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి హాల్లో చూపించుకోవడానికి వచ్చిన ఒక గుర్తు తెలియని మహిళా వృద్ధురాలు కింద పడి ఉండగా సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చూపించారని, అక్కడే ఉన్న డాక్టర్స్ వచ్చి చెక్ చేసి అడ్మిట్ చేశారన్నారు....