Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 4:52 pm Posted by : ramakrishna

గుర్తుతెలియని మహిళ మృతి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ బి.రఘుపతి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి హాల్లో చూపించుకోవడానికి వచ్చిన ఒక గుర్తు తెలియని మహిళా వృద్ధురాలు కింద పడి ఉండగా సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చూపించారని, అక్కడే ఉన్న డాక్టర్స్ వచ్చి చెక్ చేసి అడ్మిట్ చేశారన్నారు. ఆమె చికిత్స పొందుతూ ఈ నెల 30 న ఉదయం 7 గంటలకు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారన్నారు. ఆమె వయసు సుమారు గా 75 సంవత్సరాలు ఉంటుందని, ఆమె పైన బట్టలు బ్లూ ఎల్లో ఫ్లేవర్స్ సారి, రెడ్ కలర్ స్వెటరు వేసుకున్నదన్నారు. ఆమె వాలకం బట్టి భిక్షాటన చేసుకునే మహిళ గా కనపడుతున్నదని, ఆమె దగ్గర చెక్ చేయగా ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. గుర్తుతెలియని మహిళ మృతదేహం గురించి ఎవరికైనా సమాచారం తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని, 8712659714 నెంబర్ కి కాల్ చేయాలని ఆయన కోరారు.