పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడి మృతి
బతుకమ్మ నందిపేట్: నందిపేట్ మండలం ఖు ద్వాన్పూర్ గ్రామానికి చెందిన సుకృత్ (22) అనే యువకుడు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాదకర సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే, సుకృత్ గత ఏడాది రజిత అనే యువతితో కులాంతర వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో, శుక్రవారం నందిపేట్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం భార్య రజిత తన భర్త సుకృత్ వద్దకు తిరిగి వెళ్లడానికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన సుకృత్, శుక్రవారం...