Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 August 2025, 4:57 pm Posted by : ramakrishna

అక్క తో రాఖీ కట్టించుకున్న గంటలలోనే తమ్ముడిని కబలించిన  మృత్యువు

 

    . . .  జగ్గారావు పారం వద్ద బైక్ ను ఢీకొట్టిన కంటైనర్

         . . . అక్కడికక్కడే యువకుడి మృతి… మరొకరికి తీవ్ర గాయాలు

 నవిపేట్, బతుకమ్మ :

రాఖీ పండుగ నాడు సోదరితో రాఖీ కట్టించుకుని తిరుగు ప్రయాణమైన తమ్ముడిని కంటైనర్ రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. పండగ నాడు అ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిర్మల్ జిల్లా బాసర కు చెందిన సాయి బబ్లూ (21)  మరో యువకుడి తో కలిసి బైక్ పై బాసర్ వెలుతుండగా నవీపేట్ మండలం జగ్గారావు ఫారం వద్ద కంటైనర్ డి కొట్టింది. ఈ ఘటనలో బబ్లూ అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. సాయి బబ్లూ సోదరి నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్డులో  అత్తారింటిలో ఉండగా అక రాఖీ పండుగ బాసర్ నుంచి శనివారం ఉదయం వచ్చాడు. అక్కతో రాఖీ కట్టించుకుని బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సోదరుడు చనిపోయిన విషయం తెలిసి అక్క తో పాటు వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సాయిబబ్లూ స్థానిక దేవాలయంలో తాత్కాలిక ఉద్యోగి పనిచేస్తున్నట్లు సమాచారం… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Death claimed the younger brother within hours of tying the rakhi with his sister.